హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరణ్ కోట్లో వీధి కుక్కల బెడద

VKB: తాండూరు మండలంలోని కరణ్ కోట్ గ్రామంలో వీధి కుక్కల బెడద పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయని, ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తున్నాయని తెలిపారు. చిన్నపిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.