తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం కొత్తపేటకు చెందిన సూరిబాబు (44), రమణ (39) దంపతులు నగరంలో కూలీ పనులు చేస్తున్నారు. ఈ నెల 6న మద్యం మత్తులో భర్త వేధించడంతో రమణ కర్రతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సూరిబాబు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11న మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
భర్త వేధింపులు తాళలేక కర్రతో దాడి.. మృతి


