హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రెయిన్‌ సమస్యను పరిష్కరించండి!

WG: తణుకు మండలం పైడిపర్రు మీదుగా ప్రవహించే సత్యవాడ డ్రెయిన్‌ ఏళ్ల తరబడి నిర్వహణ కొరవడింది. డ్రైయిన్స్‌ను ఆధునికీకరిస్తే ముంపు సమస్య తీరే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యర్థాలు పారకపోవడంతో నీరు వెనక్కి తన్ని సమీపంలోని కాలనీలు నీట మునిగాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.