హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగపాలెం మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి

ELR: లింగపాలెం మండలం మల్లేశ్వరం గ్రామంలోని మామిడి తోటల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ చింతలపూడి సెక్షన్ ఆఫీసర్ అబ్దుల్ భారి తెలిపారు. మల్లేశ్వరం పరిసర ప్రాంతంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పోలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిన్న జీలుగుమిల్లి మీదుగా చింతలపూడి మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి ఇవాళ మల్లేశ్వరంలో ప్రత్యక్షమైంది.