KDP: సిద్ధవటం ఎగువపేటలోని 9వ వార్డులో రెండు రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు MPDO ఫణి రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 9వ వార్డులో తాగునీటి పైపులైన్ దెబ్బతినడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత సిబ్బందితో పైపులైన్ మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిద్దవటంలో తాగునీటి సమస్యకు పరిష్కారం: MPDO


