హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు కష్టాలు

అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో చెరకు సాగు విస్తీర్ణం భారీగా పడిపోవడంతో వ్యాపారం మందగించింది. గతంలో లక్ష ఎకరాల్లో సాగైన చెరకు ప్రస్తుతం 2 వేల హెక్టార్లకు పడిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటం, తెగుళ్ల ప్రభావం వల్ల సుమారు రూ.200 కోట్ల మార్కెట్ దెబ్బతిందని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.