హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుళ్లూరులో బాల్య వివాహం అడ్డగింత

గుంటూరు: తుళ్లూరు టిడ్కో గృహ సముదాయంలో సోమవారం 14 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో జరుగుతున్న వివాహాన్ని చైల్డ్‌వెల్ఫేర్ సభ్యులు పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా బంధువులు ఎదురుతిరిగారు. అనంతరం సిబ్బంది స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇవ్వడంతో వివాహం విరమించుకుంటామని బాలిక బంధువులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.