హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు

ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 22,925, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,000, అటు క్వింటా పత్తి ధర రూ. 9,000గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, అటు పత్తి ధర రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.