హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా సమీపంలో ఇవాళ అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తొర్రూరు మండలం మాటేడు గ్రామానికి చెందిన లింగాల బ్రహ్మచారిగా మృతుడిని గుర్తించారు. బైక్‌తో పాటు, జాతీయ రహదారిపై మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.