హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి వద్ద మహిళలకు ప్రత్యేక సౌకర్యం

BDK: భద్రాచలం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే మహిళా భక్తుల కోసం బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరగడంతో, స్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఈ సౌకర్యం కల్పించారు. మహిళా భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.