హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లమల కొండల మధ్య కనువిందు చేస్తున్న కృష్ణమ్మ..!

NGKL: నల్లమల అభయారణ్యంలోని మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. అక్కడి నుంచి NGKL జిల్లా నల్లమల అడవులు కొండల మధ్య ప్రయాణిస్తే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు ప్రవహించే కృష్ణానది కనిపిస్తుంది. అడవుల మధ్య మెలికలు తిరుగుతూ ప్రవహించే కృష్ణమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది.