హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు రూ. 2.11 లక్షలు విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యన్నదాన పథకానికి మంగళవారం ఆకివీడు వాస్తవ్యులు గొంట్ల గోపాల వీర వెంకట లక్ష్మి నరసింహారావు వారి కుటుంబ సభ్యులు రూ.2,11,116  విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.