హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత కళాశాల భవనం తొలగింపు పనులు

GDWL: అలంపూర్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరడంతో తొలగింపు పనులు చేపట్టారు. అధికారుల ఆదేశాల మేరకు గత 2 రోజులుగా భవనం కూల్చివేత ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ పనులను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బండ్ల దేవేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. శిథిల భవనం తొలగింపుతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.