బాపట్ల: బల్లికురవ మండలం కె.రాజుపాలెం సర్పంచి పదవికి నిర్వహించిన వేలం పాటలో గొట్టిపాటి శ్రీహరి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. గతంలోనూ ఆయన రూ.15 లక్షలకు వేలం పాటలో గెలిచారు. ఈసారి ఆ మొత్తాన్ని రూ.35 లక్షలకు పెంచారు. సర్పంచి పదవి ఓసీ జనరల్‌కు కేటాయించారు. ఈ గ్రామ వీధికి ఒకవైపు ప్రకాశం జిల్లా, మరోవైపు బాపట్ల జిల్లా సరిహద్దులు ఉండటం ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్
కె. రాజుపాలెం సర్పంచి పదవికి రూ.35 లక్షలు!


