హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సారెస్పీ తాజా అప్డేట్...!

NZB: ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో నీటి నిల్వల్లో మార్పు లేకుండా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 1075.50 అడుగుల వద్ద, నీటి నిల్వ 33.857 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా, వివిధ అవసరాలకు 661 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.