హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో పడి యువకుడు మృతి

ఏలూరు: ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ బ్రహ్మ లింగేశ్వర స్వామి చెరువులో పడి మృతి చెందిన వ్యక్తిని వీరంకి లోకేష్ (22) గా గుర్తించినట్లు ఎస్సై వీ. సురేష్ తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో వాలంటీర్‌గా లోకేష్ విధులు నిర్వహించేవాడు. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు సమాచారం.