హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం బీచ్ వద్ద బైక్ల చోరీ

VSP: మచిలీపట్నం మంగినపూడి బీచ్ కు వచ్చిన పర్యాటకుల బైక్లను దొంగిలించిన ముగ్గురు వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. పెడన తోటమూలకు చెందిన ముగ్గురు వ్యక్తులు బీచ్ వద్ద పార్క్ చేసిన బైక్లను దొంగిలించారు. దీన్ని గమనించిన స్థానికులు వారిని గోకవరం వద్ద పట్టుకున్నారు. బడ్డీల సెంటర్లో స్థంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.