హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాలెట్ బాక్స్‌లో రూ.500 నోట్లు

చిత్తూరు జిల్లా మురంలో ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ బాక్స్‌లో విచిత్రంగా రెండు రూ.500 నోట్లు, ఒక లేఖ లభ్యమయ్యాయి. లేఖ తెరిచి చూడగా "అయ్యా! మీరిచ్చిన రూ.1000 మీరే తీసుకోండి, డబ్బులు తీసుకుని ఓటు వేసేవాళ్లం కాదు" అని అందులో రాసి ఉంది. ఈ ఓటరు చైతన్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలెక్టర్ సుమిత్ ప్రశంసించారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.