హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జైల్లో ఖైదీలకు ఆధార్..!

విశాఖపట్నం కేంద్ర కారాగారంలోని ఖైదీలకు ఆధార్ సంబంధిత సేవలను చేరువ చేసేందుకు జైలు అధికారులు ప్రత్యేక చొరవ చూపారు. కారాగార ఆవరణలో సోమవారం ప్రత్యేక ఆధార్ నమోదు, సవరణల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా ఖైదీలకు నూతన ఆధార్ నమోదుతో పాటు, అవసరమైన ఇతర ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.