హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ మాఫియాపై ఉక్కుపాదం: డీఎస్‌వో

ELR: జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు జిల్లా పౌరసరఫరాల అధికారి బాబు విలియమ్స్ తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ చట్టం కింద కేసులు పెడతామని, బియ్యం అమ్మిన కార్డుదారుల కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురంలో తనిఖీలు చేశామన్నారు.