అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల పంచాయతీలో తెదేపా కార్యకర్తల వాహనంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలకు చెందిన కారు ధ్వంసమైంది. వైసీపీ కార్యకర్తల తీరుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా మద్దతుదారులపై దాడులు చేయడం సరికాదని రామాపురం తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెదేపా కార్యకర్తల కారుపై వైసీపీ దాడి


