హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో BARC ప్రధాన నివాస కాలనీ అభివృద్ధికి ఎంవోయూ

విశాఖపట్నంలో బాబా అణు పరిశోధనా కేంద్రం (BARC) ప్రధాన నివాస కాలనీ అభివృద్ధికి కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD), BARC మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న BARC ప్రధాన నివాస కాలనీకి మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు 70 నివాస గృహాలను నిర్మించనున్నారు.