హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్ 17న ఉదయం 9:30 గంటలకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జేకేసీ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో ఇండస్‌ఇండ్ నిప్పాన్ లైఫ్, డెల్టా స్టీల్ స్ట్రక్చర్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. అర్హత పత్రాలతో అభ్యర్థులు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.