ATP: నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కుళ్లాయప్ప, ఆలం వెంకట నరసనాయుడు, ఉమామహేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు


