హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం

GNTR: పోలీసు శాఖలో ఐక్యత, పరస్పర సహకారానికి నిదర్శనంగా మహిళా హోంగార్డు నాగాటి కరుణకుమారి కుటుంబానికి తోటి సిబ్బంది ఆర్థిక చేయూత అందించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులంతా స్వచ్ఛందంగా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించి సమకూర్చిన రూ.2,11,680 విలువైన చెక్కును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం అందజేశారు.