AKP: దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరువైంది. గరిష్ఠ మట్టం 114 మీటర్లు కాగా, సోమవారం 113.80 మీటర్లకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం 500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో, అంతే మొత్తంలో స్పిల్వే ద్వారా శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. శారదా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయ డిఈఈ జి.సత్యంనాయుడు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'గరిష్ట స్థాయికి రైవాడ జలాశయం'


