హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ కేంద్రాలైన కలెక్టరేట్ కార్యాలయం, వంశధార కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.