కృష్ణా: జిల్లాలోని కోడూరు శివారు నరసింహపురం వద్ద రొయ్యల చెరువుల దగ్గర సోమవారం విషాదం జరిగింది. పక్కనే భూమి కౌలుకు సాగుచేస్తున్న దొనేపూడి గోపాలకృష్ణకు విద్యుత్ షాక్ తగిలి కేకలు వేయగా, కాపాడబోయిన దింటిమెరక టీడీపీ నేత పొనమాల వెంకటేశ్వరరావు (52) విద్యుదాఘాతంతో మృతిచెందారు. మృతదేహాన్ని అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఛార్జ్ ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విషాదం..విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి


