హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు భారీ వర్షపాత హెచ్చరిక

PLD: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో రానున్న ఐదు రోజులలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ఎడ్లపాడు మండలంలో అత్యధికంగా 175.08 మి.మీ, చిలకలూరిపేటలో 155.75 మి.మీ, నాదెండ్లలో 141.4 మి.మీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.