హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

SS: శ్రీ సత్యసాయి జిల్లాలో భూగర్భ జలాల పెంపు, నీటి ఎద్దడి నివారణపై కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సోమవారం అధికారులతో సమీక్షించారు. చెరువులు, కుంటలు, కాలువలకు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ ద్వారా జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని, 48 గంటల్లో పనుల ఆమోదం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.