హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విత్తన దుకాణంపై ఏవో ఆకస్మిక తనిఖీ

PLD: నకరికల్లులోని 'ఎన్. చిన్నయ్య అండ్ సన్స్' విత్తన దుకాణాన్ని ఏవో కే. దేవదాస్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ పరిశీలించి, నాలుగు నమూనాలను ల్యాబ్‌కు పంపారు. లైసెన్స్ డీలర్ల వద్దే విత్తనాలు కొనాలని రైతులకు సూచించారు. రసీదుపై లాట్ నంబర్, సంతకాలు తప్పనిసరి అని డీలర్‌ను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఏఈవో దిలీప్ కుమార్, వీఏఏ ప్రభాకర్ పాల్గొన్నారు.