హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల్లో ఆ వేలికే సిరా గుర్తు!

PLD: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేయబడుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఓటర్లు, పోలింగ్ సిబ్బంది ఈ మార్పుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.