ASR: గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారులు ఆదివారం పాడేరు, హుకుంపేట, అనంతగిరి మండలాల్లో ఒక్కొక్క ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. కేంద్రం ఒక్కో పాఠశాలకు సుమారు రూ.30 కోట్లు మంజూరు చేసింది. గిరిజన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందుతుందని హుకుంపేట లో ప్రారంభించిన అధికారి తెలిపారు. ఉప విద్యాశాఖాధికారి, ఎంఈవోలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడు ఏకలవ్య పాఠశాలలు ప్రారంభం


