హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ వివాదం..8 మందికి జైలు శిక్ష

అన్నమయ్య: రాయచోటి భూ వివాదంలో ఒకే కుటుంబంపై కత్తులు, కర్రలతో దాడి చేసిన కేసులో ఎనిమిది మందికి రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2015లో నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నలుగురికి అదనంగా మరో ఏడాది శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు సిబ్బందిని అభినందించారు.