హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు

KRNL: ఓర్వకల్లు మండలం ఎన్.కొంతలపాడులో వైసీపీకి చెందిన మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మాధవస్వామితో పాటు 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. సోమవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.