హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

అన్నమయ్య జిల్లాలో రాష్ట్రంలో రూ.6 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉంచి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని AISF జిల్లా కార్యదర్శి కె. మాధవ్ విమర్శించారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.