హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29 పంచాయతీలూ గెలవాలి: సంధ్యారాణి

PPM: పాచిపెంట మండలంలో మొత్తం 29 పంచాయతీల్లోనూ టీడీపీ జెండా ఎగరాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆదివారం కార్యకర్తల సమావేశం లో మాట్లాడిన ఆమె, పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ఎంపీటీసీగా ఓడినవారు నిరుత్సాహపడొద్దని సూచించారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందుతాయని, వాటితో గ్రామాభివృద్ధి సాధ్యమని చెప్పారు.