NDL: తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు కర్నూలు, నంద్యాలలో కార్తీక మాస ధార్మిక ప్రవచన సప్తాహం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ప్రవచనాలు ఉంటాయని డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు. 21న తులసీ దామోదర కల్యాణం, 24న జ్వాలాతోరణం, సహస్ర కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తితిదే ఆధ్వర్యంలో కార్తీక మాస ప్రవచన సప్తాహం


