హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వాన్న రహదారితో ఇబ్బందులు

ASR: పోలవరం జిల్లా చింతూరు మండలం సరివెల నుండి పేగ వెళ్లే రహదారి కంకర లేచిపోయి అద్వాన్నంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ రహదారి అటవీశాఖ అడ్డంకులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో అప్పటినుండి రహదారి అలాగే ఉండడంతో వాహనదారులు, కాలినడకన వెళ్లే గిరిజన ప్రజలు రహదారిపై నడవలేక అష్టకష్టాలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.