హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారుణం.. కన్న తల్లిపై కొడుకు దాడి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిపై కొడుకు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.