KRNL: కార్తీక మాసం సందర్భంగా చెరుకులపాడు గ్రామంలోని శ్రీ శివాలయంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివునికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, శివుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


