హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెక్కలి సీఐకి బెదిరింపు లేఖ - కలకలం

SKLM: టెక్కలి సీఐ అంబటి విజయ్ కుమార్‌కు గుర్తుతెలియని వ్యక్తుల పేరుతో బెదిరింపు లేఖ వెలువడటం కలకలం రేపింది. సోమవారం నాడు స్థానిక డిగ్రీ కళాశాలలో కరపత్రాలు వెలువడ్డాయి. సామాన్యులను వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించిన దుండగులు, మరోసారి ఇలా చేస్తే భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తే తరిమి తరిమి కొడతామని బెదిరించారు.