హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమేశ్వర స్వామి ఆలయ ఏర్పాట్ల పరిశీలన

శ్రీకాకుళం కొన్నవీధిలోని భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మొదటి సోమవారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయాన్ని హరిత దేవాలయంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా చిరువ్యాపారులకు పర్యావరణ హిత సంచులు పంపిణీ చేశారు.