హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పూడిలో సర్పంచ్ నామినేషన్

కోనసీమ: కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జొన్నాడ రాజారావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏఎంసీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ ఆధ్వర్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి, దీర్ఘకాలిక మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రాజారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు బండారు రాజారావు పాల్గొన్నారు.