హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించిన కమిషనర్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం ఎస్పీ బంగ్లా పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కరెంటు ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.