హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తీలో అంతరాలయ దర్శనాలు నిలిపివేత

TPT: కార్తీక రెండో కోటి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనాన్ని ఈరోజు నిలిపివేశారు. క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఆలయ అధికారులు పాలు, తాగునీరు అందించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఈవో బి.కె. వెంకటేశు ఏర్పాట్లను పర్యవేక్షించారు.