హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధురవాడలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

VSP: జీవీఎంసీ మధురవాడ జోన్ కార్యాలయంలో సోమవారం జోన్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ఆధ్వర్యంలో ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి 19 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేసి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.