VSP: ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా గాజువాక ఆర్టీసీ డిపో నుంచి 30 ఎలక్ట్రిక్ బస్సులను సోమవారం ప్రారంభించారు. గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. కాలుష్య రహిత ప్రయాణంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాజువాకలో 30 ఎలక్ట్రిక్ బస్సులు


