హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఛైర్మన్ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే వైసీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ వేశారు. ఇవాళ మరో ఇద్దరు నరసింహారావు, వెంకట్రావు నామినేషన్ వేయడంతో ఛైర్మన్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆలోచన అర్థం కాక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.