హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో వైభవంగా కార్తీకమాస వేడుకలు

కడప: వేంపల్లిలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా గవిమల్లేశ్వర స్వామి దేవస్థానానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సూర్య-చంద్రేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు కార్తీక మాసంలోని తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.